Breaking News

TS: బీజేపీ ఎలక్షన్‌ కమిటీల ప్రకటన

Published on Thu, 10/05/2023 - 11:22

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ప్రకటించింది బీజేపీ. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీల్ని ప్రకటించింది బీజేపీ.  ఇందులో భాగంగా.. రాజగోపాల్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది. పబ్లిక్‌ మీటింగ్‌ కమిటీ ఇంఛార్జ్‌గా బండి సంజయ్‌,  మ్యానిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్ గా గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ఛార్జ్‌షీట్‌ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌రావు ఎంపిక చేసింది. వీటితో పాటు..  

అజిటేషన్ కమిటీ(నిరసనలు, ఆందోళన నిర్వహణల బాధ్యతలు)  చైర్మన్ గా విజయశాంతి, ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిటీ చైర్మన్గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్‌లకు బాధ్యతలు అప్పజెప్పింది. పొంగులేటి సుధాకర్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రామచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు సైతం కమిటీలలో చోటు కల్పించారు.  

తెలంగాణను ఆరు జోన్లుగా విభజించుకుని.. ఎన్నికల వ్యూహాలు అమలు చేయాలని కమలం భావిస్తోంది. ఈక్రమంలోనే.. ఇవాళ నేడు సంస్థాగత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సునీల్‌ బన్సల్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొంటారు. వెయ్యి మందికి పైగా ఈ సమావేశాలకు హాజరవుతారని అంచనా.పార్లమెంట్‌,అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)