Breaking News

Tejasvi Surya Assets: ఎంపీ అయిన ఐదేళ్లలో 30 రెట్లు పెరిగిన ఆస్తులు!

Published on Sat, 04/06/2024 - 14:19

దేశంలో ఒకవైపు ఎన్నికల వేడి,  మరోవైపు వేసవి తాపం.. రెండు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాయి. పలువురు నేతలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ నేత తేజస్వి సూర్య కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. 

తెజస్వీ సూర్య  బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఆయన వెంట ఉన్నారు. సూర్య  తన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ.4.10 కోట్లుగా పేర్కొన్నారు. తనకు ఎలాంటి స్థిరాస్తి లేదని బీజేపీ ఎంపీ వివరించారు. కాగా ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన ఆస్తుల విలువ రూ.13 లక్షలుగా చూపించారు. ఇప్పుడు వాటి విలువ   31.5 శాతాన్ని దాటింది. సూర్య మొత్తం ఆస్తుల విలువ రూ.4.10 కోట్లు. మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.1.99 కోట్లు పెట్టుబడి పెట్టారు. అలాగే రూ.1.79 కోట్లకు పైగా విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో అధికంగా పెట్టుబడులు పెట్టానని, మార్కెట్‌లో బూమ్ కారణంగా తన సంపద పెరిగిందని సూర్య తన అఫిడవిట్‌లో వివరించారు.

సూర్య ..బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ పూర్వ విద్యార్థి. కర్ణాటక హైకోర్టులో న్యాయవాది. బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్యం మేనల్లుడు. ప్రస్తుతం బెంగళూరు సౌత్ ఎంపీగా ఉన్నారు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌పై మూడు లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. కాగా ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఈసారి దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)