Breaking News

‘ఇలాంటి వ్యక్తా ప్రభుత్వాన్ని నడిపేది’.. సీఎం నితిష్‌ కుమార్‌ వీడియో వైరల్‌

Published on Sun, 10/05/2025 - 20:14

పాట్నా: బిహార్ రాజకీయాల్లో సీఎం నితీశ్‌ కుమార్‌ తీరు మరోసారి చర్చాంశనీయంగా మారింది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభంలో ఓ కార్యక్రమంలో వింతగా ప్రవర్తించారు. దీంతో నితీశ్‌ పరిపాలనపై ప్రశ్నలు తలెత్తాయి. 

ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ టాపర్ల కోసం దేశవ్యాప్తంగా జరిగే నైపుణ్య స్నాతకోత్సవం Kaushal Deekshant Samaroh 2025లో నితీష్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్​ విధానం ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న నితీష్​ కుమార్ దాదాపు ఒక నిమిషం పాటు చేతులు ముడుచుకుని కూర్చుని కనిపించారు. ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివరాలను వ్యాఖ్యాత చదువుతుండగా.. నితీష్​ తన చేతులను ఒకదానికొకటి పట్టుకుని కూర్చున్నారు. కొద్దిగా కదిలించి పక్కకు చూశారు. అయితే ఆయన ఈ ప్రవర్తన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సీఎం ఆరోగ్యం బాగానే ఉందా అనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ అబ్బే ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం నడపలేరంటూ’ ఘాటు వ్యాఖ్యలే చేశారు.

ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం నడపలేరు. ఇది రాష్ట్రానికి ప్రమాదకరం. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో ముఖ్యమంత్రి స్థిరంగా మాట్లాడలేకపోతే ఎలా?’అని ప్రశ్నించారు. అలాగే, ఆయన పాలనలో బిహార్‌ పూర్తిగా గందరగోళంగా మారిందని, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. 

నితీశ్‌పై తేజస్వీ చేసిన విమర్శల్ని జేడీయూ నేతలు ఖండిస్తున్నారు. నితీశ్ కుమార్ అనుభవజ్ఞుడు. ఆయనపై ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొట్టిపారేశారు. బిహార్ రాజకీయాల్లో ఈ ఘటన మరో మలుపు తీసుకురావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వానికి పారదర్శకత అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)