Breaking News

రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకి రాడట!

Published on Mon, 01/15/2024 - 09:58

స్వయంగా శ్రీరామచంద్రుడే ఆయన కలలోకి వచ్చాడట!. వచ్చి ఏం చెప్పాడనేగా.. ఏం లేదు ఈ నెల 22వ తేదీన జరగబోయే అయోధ్య రామ్‌లల్లాప్రాణ ప్రతిష్టకు తాను రావట్లేదని చెప్పాడట!. ఎందుకు.. రాముడు ఏమైనా అలిగాడా?

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై పలువురు నేతలు వ్యాఖ్యలు చేస్తుండడం.. వాటిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడం చూస్తున్నాదే. తాజాగా  లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు, బీహార్‌ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అదే తరహా స్టేట్మెంట్‌ ఇచ్చారు. 

‘‘ఒక్కసారి ఎన్నికలు అయిపోయాయంటే శ్రీరామచంద్రుడ్ని అంతా మరిచిపోతారు. అలాంటప్పుడు జనవరి 22వ తేదీన రావడం అవసరమా?. నాలుగు శంకరాచార్యులతో పాటు నా కలలోకి శ్రీరాముడు వచ్చారు. అయోధ్యలో కపటనాటకం నడుస్తుంది కాబట్టి తాను రావట్లేదని నాతో చెప్పారు’’ అని ఓ కార్యక్రమంలో తేజ్‌ ప్రతాప్‌ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. 

వైరల్‌ అవుతున్న ఈ వ్యాఖ్యలపై తేజ్‌ ప్రతాప్‌ సోదరుడు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ స్పందించాల్సింది. మరోవైపు  ఈ ఆర్జేడీ యువ నేత వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో అనే ఆసక్తి నెలకొంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)