Breaking News

ఫేక్‌ ఐడీలతో టీడీపీ పోస్టింగ్‌లు

Published on Sat, 02/03/2024 - 05:46

సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, హైదరాబాద్‌:  తెర వెనుక టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి! కుట్రపూరితంగా పోస్టింగ్‌లు చేస్తూ బురద చల్లేందుకు ఎల్లో గ్యాంగ్‌ చేసిన యత్నాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నివాసి వర్రా రాఘవరెడ్డి దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. జనవరి 26వతేదీ నుంచి తన పేరుతో కొందరు ఫేక్‌ ఐడీ సృష్టించి పోస్టులు పెడుతున్నట్లు గుర్తించిన ఆయన 28న పులివెందుల ఎస్‌ఐ అరుణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

ఏపీ పీసీపీ చీఫ్‌ షర్మిలను అసభ్యంగా దూషిస్తూ ఫేక్‌ ఐడీ ద్వారా పోస్టులు చేస్తున్నారని, ఫేక్‌ ఐడీని ట్రేస్‌ చేయాలని రాఘవరెడ్డి కోరారు. ఇదే విషయంపై జనవరి 31న వైఎస్సార్‌ జిల్లా  ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కాగా మాజీ మంత్రి వైఎస్‌ వివేకా కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీత తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని దూషిస్తున్నారని వర్రా రాఘవరెడ్డి పేరుతో ఉన్న ఫేక్‌ ఐడీ వివరాలను హైదరాబాద్‌ పోలీసులకు అందచేశారు.

తన పేరుతో ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసి తప్పుడు పోస్టులు ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం వెనుక ఐ– టీడీపీ శ్రేణులున్నాయని వర్రా రాఘవరెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ఇలాంటి పోస్టులను ముందే పసిగట్టిన తాను ఇప్పటికే ఏపీ పోలీసులను విచారించాలని కోరినట్లు తెలిపారు. 

బెదిరింపులు పెరిగాయి: సునీత
మాజీ మంత్రి వైఎస్‌ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తనకు ప్రాణహాని ఉందంటూ శుక్రవారం హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఇద్దరినీ చంపేస్తాం..’ అనే అర్థం వచ్చేలా గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్‌బుక్‌ ద్వారా పోస్టులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఈ తరహా బెదిరింపులు ఎక్కువయ్యాయని, పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ శిల్పవల్లి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

#

Tags : 1

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)