Breaking News

పళ్లు రాలగొడతా రాస్కెల్.. టీడీపీ ఎమ్మెల్యే గంటా తిట్ల పురాణం

Published on Thu, 04/10/2025 - 15:35

సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహనం కోల్పోయారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవిపై నోటి దురుసు ప్రదర్శించారు. పళ్లు రాలగొడతా రాస్కెల్ అంటూ తిట్లు లంకించుకున్నారు. గాడిదలను కాస్తున్నారా? కళ్లు కనిపించడం లేదా అంటూ తిట్ల దండకం అందుకున్నారు. గురువారం ఆయన ఎండాడలో పర్యటించారు. తాగేందుకు నీరు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవంటూ ఎమ్మెల్యేను నిలదీశారు.

వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక వైపు.. సంక్షేమ పథకాలను అందించడం లేదు. మరో వైపు.. అభివృద్ధి కూడా జరగడం లేదు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక.. ఆ అధికారిపై గంటా నోరు పారేసుకున్నారు. గంటా తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, మంగళవారం.. మున్సిపల్‌ కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ స్థానికంగా నివాసం ఉంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే గంటాకు ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఎంవీపీ కాలనీ సెక్టార్‌– 4లోని ఆయన ఇంటికి  వెళ్లారు.

ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ వినతిపత్రం స్వీకరించేందుకు బయటకు రాలేదు. గంటన్నర పాటు నిరీక్షించినా.. స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తీవ్రం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం గంటా పీఏలు అక్కడికి వచ్చి వినతిపత్రం తమకు ఇవ్వాలని కోరినా కార్మికులు అంగీకరించలేదు.ఓ ప్రజాప్రతినిధి అయివుండీ కార్మికుల సమస్యలు వినడానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)