Breaking News

ఆళ్లగడ్డలో వంద మంది నా టార్గెట్‌.. అఖిలప్రియ

Published on Fri, 09/06/2024 - 20:13

సాక్షి, నంద్యాల: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. రెడ్‌బుక్‌ అంటూ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రజాపాలన, ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం వైఎస్సార్‌సీపీ నేతలను, అధికారులను టార్గెట్‌ చేస్తూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా మీడియాలో బహిరంగంగానే భూమా అఖిలప్రియ.. వార్నింగ్‌ ఇచ్చారు. రానున్న రోజుల్లో తన వల్ల 100 మంది ఇబ్బంది పడుబోతున్నారని ఓపెన్‌గా చెప్పారు.

ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ..‘నాకు ఓ రెడ్‌ బుక్‌ ఉంది. అందులో వంద మందికిపైగా వైఎస్సార్‌సీపీ నాయకుల పేర్లు ఉన్నాయి. పాపం పోనీలే అని ఇద్దరు, ముగ్గురిని వదిలేస్తున్నాను. కానీ, వంద మందిని మాత్రం వదిలిపెట్టే ​ప్రసక్తే లేదు. రానున్న రోజుల్లో వంద మంది కచ్చితంగా ఇబ్బంది పడబోతున్నారు. వారి పేర్లు నా రెడ్‌ బుక్‌లో ఉన్నాయి అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు.

అంతేకాకుండా.. ఆళ్లగడ్డలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అని ఎప్పుడైనా చెప్పానా?. మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తానని ముందే చెప్పాను కదా. అదే విధంగా ఎవరినీ వదిలిపెట్టను. అందరి తోలుతీస్తాను. నేనేం మంచి దాన్ని కాదు. నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా?. నేను మంచి పద్ధతిలో పోతానని ఎవ్వరూ అనుకోకండి’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో, ఆమె వ్యాఖ్యలను పలువురు రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు.

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)