Breaking News

ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి ఝలక్‌.. టీడీపీ శ్రేణుల కొత్త రాజకీయం!

Published on Thu, 10/16/2025 - 12:24

సాక్షి, వైఎస్సార్‌: కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబావుట ఎగురవేశారు. మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆయన భర్త శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీనియర్లు లేరు.. తొక్కా లేదన్న శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముస్లిం మైనార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు ఎగురవేశారు. పార్టీకి మొదటి నుంచీ సేవలందించిన వారిని పక్కన పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడపలోని పలువురు మైనార్టీ టీడీపీ నేతలు పెద దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవీ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ప్రార్ధనలు చేశారు. క్రమంలో తిరుగుబాటు వర్గాన్ని కమలాపురం నేత పుత్తా నరసింహారెడ్డి దగ్గరకు తీసుకున్నారు. పార్టీని కాపాడాలంటూ పుత్తా వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

అధికారం వచ్చి ఏడాదిన్నర అయినా పార్టీ సీనియర్లను పట్టించుకోలేదని ఆరోపించారు. దీనికి తోడు అంతా తమ కుటుంబ పెత్తనమేనంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై నిరసన తెలిపారు. ఇంత వరకూ ఒక్క మైనార్టీ నేతకు కూడా నామినేటెడ్‌ పదవులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కడపకు రాక ముందు నుంచీ పార్టీ తరఫున కష్టాలకోర్చి ముందుకు తీసుకెళ్లామని సీనియర్‌ నాయకులు అన్నారు.

మరోవైపు.. కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీరుతో రోజుకో వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ శ్రేణులు మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీలో రోజుకో వర్గం తిరుగుబావుటా ఎగురవేయడంతో ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో, టీడీపీలో మరో వర్గం ఏర్పడినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌