Breaking News

తాడిపత్రిలో టెన్షన్‌.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై...

Published on Thu, 02/20/2025 - 09:26

సాక్షి, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు  రెచ్చిపోయారు. తాజాగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, జేసీ ప్రభాకర్‌ రెడ్డి వర్గీయులే దాడి చేసినట్టు బాధితులు చెబుతున్నారు.

వివరాల ప్రకారం.. అనంతపురంలోని పెద్దవడగూరు మండలం అప్పేచర్లలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అరాచకం సృష్టించారు. గురువారం ఉదయం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తల తలకు బలమైన గాయం కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడి విషయాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్త భాస్కర రెడ్డి సెల్ఫీ వీడియోలో వివరించారు.

ఇదిలా ఉండగా.. తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై దళిత సంఘం నేత రాంపుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను ఫోన్‌లో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరించిన జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.  ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు చెప్పాలని సమాచార చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీకి రిజిస్టర్ పోస్టు ద్వారా వివరాలను పంపించారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)