Breaking News

‘ఆమె ముందు చేతులు కట్టుకోవాలి.. చైర్‌లో కూర్చోకూడదు’

Published on Thu, 08/29/2024 - 11:22

ఆమె ఎమ్మెల్యే కాదు.. కనీసం సర్పంచ్ కూడా కాదు. కానీ, ఆమె ముందు ఎంత పెద్ద అధికారి అయినా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఏ అధికారైనా తన కుర్చీ ఆమెకి ఇచ్చేసి.. మీ దయ అంటూ ఆమె ఎదురుగా సదరు అధికారి నిల్చోవాల్సిందే లేదంటే కూర్చోవాల్సిందే. దీంతో, ఈ వ్యవహారం పల్నాడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు? అనుకుంటున్నారా..

ఇక్కడ.. కుర్చీలో కూర్చొని దర్జాగా ఆదేశాలు జారీ చేస్తున్న ఈమె గొట్టిపాటి లక్ష్మీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దర్శి  టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి లక్ష్మీ ఓడిపోయారు. అయితే, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు స్వయానా అన్న కూతురు. అందుకే కాబోలు మా బాబాయి మంత్రి అనుకున్నారేమో .. దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇంఛార్జీగా ఉన్న ఆమె నియోజకవర్గంలో హల్‌చల్‌ చేస్తున్నారు. తానే ఎమ్మెల్యే అన్నట్టుగా అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు.

దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ చైర్‌లోనే ఆమె కూర్చుంటే ఆయన మాత్రం వినయంగా  గొట్టిపాటి లక్ష్మీ ఎదురుగా ప్లాస్టిక్ చైర్‌లో కూర్చొని  వినయం ప్రదర్శించాడు. ఎమ్మెల్యే లెవెల్లో అధికారులుపై పెత్తనం చేశారు. ప్రజల బాగుకోసం ఆసుపత్రిని సందర్శిస్తే తప్పులేదు. కానీ, ఏకంగా సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చుని ఆయనను అవమానించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆమె ప్రవర్తన తీరును చూసి ఆసుపత్రి సిబ్బంది కూడా విస్తుపోయారు. మరోవైపు.. కూటమి సర్కార్‌ ఏర్పడిన నాటి నుంచి దర్శిలో గొట్టిపాటి లక్ష్మీ, ఆమె బంధు వర్గం చేస్తున్న ఓవరాక్షన్‌పై నియోజకవర్గంలోని ప్రజలు మండిపడుతున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)