Breaking News

టీడీపీలో ఉన్నా.. లేకున్నా ఒక్కటే 

Published on Sat, 07/08/2023 - 03:36

తిరుపతి మంగళం: ‘భుజాలు అరిగిపోయేలా టీడీపీ జెండాలు మోశాం. పార్టీ కోసం ఎనలేని సేవలందించాం. జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందినట్టుగా టీడీపీ ప్రభుత్వంలో ఏనాడు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందలేదు. ప్రజలకు మేలు చేయని టీడీపీలో ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటే. జగనన్న లాంటి నాయకుడు మళ్లీ సీఎం కావాలి’ అంటూ తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ తరఫున 30వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి గా పోటీచేసిన గుర్రమ్మ చెప్పారు.

తిరుపతి నెహ్రూనగర్‌లో గురువారం కార్పొరేటర్‌ కల్పనయాదవ్, డివిజన్‌ అధ్యక్షుడు ఎస్‌కే ఇమ్రాన్‌బాషా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్‌ నారాయణ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ డివిజన్‌ నుంచి పోటీచేసిన గుర్రమ్మ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించారు.

తాను కూడా జగనన్న సంక్షేమ పథకాల ద్వారా రూ. 11 లక్షలు లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే భూమనకు ఆమె సంతోషంగా చెప్పారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ‘సీఎం వైఎస్‌ జగన్‌ కులాలు, మతాలు, పారీ్టలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప నాయకుడు. చంద్రబాబు ధనవంతులకు కొమ్ముకాస్తే, జగనన్న పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. అలాంటి గొప్ప నాయకుడికి అండగా ఉండాలి’ అని చెప్పారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)