Breaking News

దళితులపై కారంచేడు తరహా దాడులకు టీడీపీ కుట్ర

Published on Mon, 06/03/2024 - 03:59

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ మెజార్టీ సాధించిన తర్వాత దళితులపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నా­రని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్‌ కెనడీ విమర్శించారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీల సంక్షేమం జరిగిందని, అందువల్లనే ఈ ఎన్నికల్లో ఆయా వర్గాలన్నీ వైఎస్సార్‌సీపీకే మద్దతుగా నిలిచాయని చెప్పారు. 

పోలింగ్‌ జరుగుతున్న రోజే ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ నాయకులు పలు జిల్లాల్లో దళితులపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, బీసీలకు సీఎం జగన్‌ సంక్షేమ పథకాలతో మేలు చేశారని, అందుకు కృతజ్ఞతగా ఈ ఎన్నికల్లో దళితులు, మైనార్టీలు, బీసీలు ఆయనకు అండగా ఉన్నారని తెలిపారు. అది సహించలేని టీడీపీ.. దళితులపై దాడులు చేయాలనే ఆలోచనల్లో ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

30 ఏళ్ల కిందటి కారంచేడు వంటి ఘటనలు పునరావృతం చేయడానికి టీడీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని జయప్రకాష్‌ కెనడీ ఆరోపించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఇచ్చిన ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునే హక్కు దళితులకు లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత దళితులపై దాడులు జరగకుండా ఎలక్షన్‌ కమిషన్, డీజీపీ పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాలని విన్న­వించారు. 

ఏపీ ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర జేఏసీ కన్వీనర్‌ మేదర సురేష్‌ మాట్లాడుతూ టీడీపీ నేతలు పోలింగ్‌ రోజున దళితులపై దాడులకు తెగబడుతున్నా ఎలక్షన్‌ కమిషన్‌ ప్రేక్షకపాత్ర వహించిందని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత దళితులపై దాడులు జరిగితే దానికి ఎలక్షన్‌ కమిషన్, డీజీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో విజయవాడ మాలమహానాడు నగర  అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)