Breaking News

కేంద్రంలో కేబినెట్‌ పదవి.. 2 సహాయ శాఖలు!

Published on Sat, 06/08/2024 - 04:20

సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా కొలువుదీరనున్న ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జేడీయూలు అడుగుతున్నన్ని కేబినెట్‌ బెర్త్‌లు, కీలక శాఖలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 16 లోక్‌సభ స్థానా­లు గెలుచుకున్న టీడీపీ కోరుతున్నట్లుగా ఐదు కేబినెట్‌ పదవులతో పాటు స్పీకర్‌ పదవి ఇవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని బీజేపీ పెద్దలు చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు సమాచారం.

టీడీపీకి ఒక కేబినెట్‌ మంత్రిత్వ శాఖతో పాటు రెండు సహా­యక మంత్రి పదవులను ఇచ్చేందుకు సుము­ఖత వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శాఖల కేటాయింపుపై చంద్రబాబు శుక్రవారం రెండో దఫా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర పెద్దలతో చర్చించినా సానుకూల ఫలితం దక్కలేదని తెలుస్తోంది.

కీలక శాఖలు ఇవ్వలేం..!
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువుదీరనున్న మోదీ ప్రభుత్వంలో కీలకమైన హోం, ఆర్ధిక, రక్షణ, రైల్వే, న్యాయ, ఐటీ, రోడ్లు, రహదారుల శాఖలను భాగస్వామ్య పక్షాలకు ఇవ్వకూడదని ఇప్పటికే బీజేపీ పెద్దలు నిరాకరించారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖతో పాటు పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృధ్ధి, ఐటీ కమ్యూనికేషన్లు, నౌకాయాన శాఖలను టీడీపీ కోరినట్లు తెలిసింది. దీనికి అదనంగా స్పీకర్‌ పదవి కూడా తమకే ఇవ్వాలని అడిగినట్లు జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే బీజేపీ పెద్దలు ఇందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.

2014లో మాదిరిగానే పౌర విమానయాన శాఖతో పాటు సహాయ శాఖల్లో కీలక శాఖలు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఆ కీలక సహాయ శాఖలు ఆర్ధిక లేదా జల శక్తి శాఖ కావచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. స్పీకర్‌ పదవి కాకుండా డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2019లో ఎన్‌డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు డిప్యూటీ స్పీకర్‌ పదవిని అసలు కేటాయించలేదు. కేవలం స్పీకర్‌తోనే లోక్‌సభ వ్యవహారాలను నిర్వహించగా ప్రొటెం స్పీకర్‌లతో సభను నడిపించారు. 2014లో మాత్రం అన్నాడీఎంకేకు చెందిన తంబిదొరై, జార్ఖండ్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత కరియా ముండా డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించారు. 

మోదీతోపాటే ప్రమాణం..!
మంత్రి పదవులు, శాఖలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు విడిగా చర్చించారు. ప్రాధాన్యతలను ఆయన దృష్టికి తెచ్చారు. నరేంద్ర మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల్లో తమ పార్టీ వారు కచ్చితంగా ఉండేలా చూడాలని కోరినట్లు తెలిసింది.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)