వంశీ కేసులో బట్టబయలైన టీడీపీ పన్నాగం

Published on Tue, 02/18/2025 - 17:12

విజయవాడ:  వైఎస్సార్ సీపీ నేత వల్లభనేని వంశీ కేసులో టీడీపీ-పోలీసుల పన్నాగం బట్టబయలైంది.  వంశీ కేసులో తప్పుడు సాక్ష్యం ఇచ్చానని కోర్టుకు చెప్పిన సత్యవర్థన్ పై కేసు నమోదు చేయడంతో టీడీపీ కుట్ర తేటతెల్లమైంది.  తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని సత్యవర్థన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే అతనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో టీడీపీ కుట్ర పూరిత రాజకీయం మరొకసారి బట్టబయలైంది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు సత్యవర్థన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. సత్యవర్థన్ని బెదిరించేందుకు కేసు నమోదు  చేశారు. 

ఈ నెల 11వ తేదీన వంశీ, సత్యవర్దన్ సహా ఐదుగురిపై ఎఫ్ఐఆర్ రిజస్టర్ చేశారు పోలీసులు. 84/2025 కేసులో సత్యవర్థన్ ఏ5గా ఉన్నారు. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై కొమ్మాకోట్టు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్థన్లపై కేసు నమోదు చేశారు. 232, 351(3), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు విజయవాడ  పటమట పోలీసులు. 

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ తాజాగా వంశీ బ్యాచ్ బెదిరింపులకు లొంగి 5 లక్షలు తీసుకుని కేసు వాపస్ తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేశారు. పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్థన్ వినకుండా కేసు వాపస్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. సత్యవర్థన్ పై కేసు పెట్టి మరుసటి రోజు అన్న తో ఫిర్యాదు చేయించారు పోలీసులు. ఆ ఫిర్యాదు ఆధారంగా వల్లభనేని వంశీ ని అరెస్ట్ చేశారు పోలీసులు.  దీంతో వంశీపై కుట్ర పూరితంగా టీడీపీ కేసు పెట్టించిందనే విషయం బహిర్గతమైంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)