Breaking News

175 స్థానాల్లో గెలుపే లక్ష్యం 

Published on Thu, 02/29/2024 - 04:35

మేదరమెట్ల: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పి.గుడిపాడు వద్ద వచ్చే నెలలో నిర్వహించే సిద్ధం సభ కోసం ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని ఆయన పార్టీ నేతలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మార్చి 3న జరగాల్సిన సిద్ధం సభను 10వ తేదీకి మార్చామన్నారు. సిద్ధం సభలు ఎక్కడ జరిగినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు.

ఈసారి సభకు 15 లక్షల మంది హాజరయ్యేలా వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. మరో వంద ఎకరాలు కూడా సభాప్రాంగణానికి ఆనుకుని అందుబాటులో ఉన్నాయన్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన ప్రజలు ఈ సభకు హాజరవుతారని వెల్లడించారు. మార్చి 10న సిద్ధం సభకు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాజరై ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్‌ ప్రభుత్వం పాలన చేస్తోందని కొనియాడారు.

ప్రజల స్పందన చూస్తుంటే రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందడం ఖాయమని తెలుస్తోందన్నారు. మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోందని.. అతి త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రకటించకుండా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను సిద్ధం సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటిస్తారని చెప్పారు. ఎంతమంది పొత్తులతో వచ్చి నా ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేరుగు నాగార్జున, ఎంపీలు నందిగం సురే‹Ù, మోపిదేవి వెంకట రమణారావు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌ జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు పానెం చిన హనిమిరెడ్డి, కరణం వెంకటేశ్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)