Breaking News

కేటీఆర్‌పై బండి సంజయ్‌ పోటీ?

Published on Thu, 08/31/2023 - 13:11

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఈ వారం రోజుల్లో ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహాగానాలు తగ్గట్లుగానే సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్‌ బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అభ్యర్థలు ఎంపికలో బీజేపీ ఓ స్ట్రాటజీతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. 

అసెం‍బ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ మంత్రులను లక్ష్యంగా చేసుకుని..  బలమైన అభ్యర్థులను దించాలని బీజేపీ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఓడినా.. తిరిగి ఎంపీలుగా వాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో.. గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుపైన.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దింపే యోచనలో ఉంది.

కేసీఆర్‌ పాపులారిటీని, గులాబీ దండు హవాను తట్టుకుని మరి.. హుజురాబాద్‌లో లోకల్‌ సెంటిమెంట్‌తో ఆయన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక సీఎం కేసీఆర్‌ పోటీ చేయబోయే కామారెడ్డిలో.. అర్వింద్‌ను  పోటీ చేయించాలని భావిస్తోంది. అలాగే.. సిరిసిల్లలో కేటీఆర్‌పై బండి సంజయ్‌ను, సిద్దిపేటలో హరీష్ రావు పై బూర నర్సయ్య గౌడ్‌ను బరిలో దింపాలనుకుంటోంది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ లో  గంగుల కమలాకర్ పై గుజ్జుల రామకృష్ణా రెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై డీకే అరుణ, నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి పై మహేశ్వర్ రెడ్డి ఇలా.. కీలక నేతలనే బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ వారంలోనే మంత్రులపై పోటీ చేసే 15 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: సంగారెడ్డిలో వైఎస్సార్‌ ఫార్ములా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)