Breaking News

మార్నింగ్‌ వాక్‌.. మధ్యాహ్నానికి ఎన్టీయేతో కటీఫ్‌

Published on Thu, 07/31/2025 - 16:52

తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ(జులై 31, 2025) కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం (OPS) ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన ఫొటో ఒకటి వైరల్‌ అయిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. 

ఈ ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మార్నింగ్‌ వాక్‌లో కనిపించిన ఓపీఎస్‌.. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే ఆయన వర్గం నుంచి కీలక ప్రకటన వెలువడింది. తమ వర్గం ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకుందని, ఇక ఆ కూటమితో కలిసి నడిచేది లేదని మాజీ మంత్రి, ఓపీఎస్‌ నమ్మిన బంటు పానుర్తి రామచంద్రన్‌ గురువారం మధ్యాహ్నాం ప్రకటించారు. ఆ సమయంలో ఓపీఎస్‌ పక్కనే ఉండడం గమనార్హం. అయితే.. 

భవిష్యత్తులో ఏ పార్టీతో కలిసి నడుస్తారనేదానిపై ఆయన వర్గం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ పొత్తు అనుకోవడం లేదు.ఎన్నికలు సమీపించే సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం  అని ప్రకటించారాయన.

అన్నాడీఎంకేలో కీలక నేతగా ఉన్న పన్నీర్‌ సెల్వం.. ఎడప్పాడి కె పళని స్వామితో పొరపచ్చాలతో సొంత వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తమదే అసలైన అన్నాడీఎంకే వర్గంగా ప్రకటించుకున్న పళనిస్వామి.. ఓపీఎస్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో బహిష్కృత నేతగానే ఓపీఎస్‌ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయన వర్గాన్ని సైతం బీజేపీ దగ్గరకు తీసుకుంది. అయితే.. ఈ మధ్య జరిగిన పరిణామాలతో నొచ్చుకున్న ఆయన ఎన్టీయేకు కటీఫ్‌ చెప్పారు.

కారణం అదే..
గంగైకొండ చోళపురం పర్యటనలో ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీకి ఓపీఎస్‌ ప్రయత్నించారు. అయితే కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదు. తనకు ఆ మాత్రం ప్రాధాన్యం లేదా? రగిలిపోయారాయన. ఆ వెంటనే.. సర్వ శిక్షా అభియాన్‌ నిధుల జాప్యంపై ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు కూడా. ఇలా వరుస పరిణామాల తర్వాతే ఆయన ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు. విజయ్‌ నేతృత్వంలోని టీవీకేకు ఆయన మద్ధతు ఇస్తారంటూ గత రెండు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈలోపే ఆయన డీఎంకే అధినేతతో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది ఇప్పుడు. విజయ్‌ పార్టీనా? స్టాలిన్‌ డీఎంకేనా? అనే ఛాయిస్‌ను బట్టి ఓపీఎస్‌ను అన్నాడీఎంకే టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.

బలం పెంచుకునే యోచనలో ఓపీఎస్‌ 
ఓపీఎస్‌ వర్గంలో దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందిన బలమైన నేతలే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆ వర్గంలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వీళ్లలో వీసీ ఆరుకుట్టి ఇప్పటికే పళనిస్వామి వర్గం వైపుళ్లిపోయారు. ఓపీఎస్‌ కొడుకు రవీంద్రనాథ్‌ కూడా విజయ్‌ టీవీకేతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన మరికొందరిని ఆ పార్టీలోకి తీసుకెళ్తారని ఊహాగానాలు వినవస్తున్నాయి. అదే సమయంలో.. 

మాజీ సీఎం జయలలితకు సన్నిహితురాలైన శశికళతో పాటు టీటీవీ దినకరన్‌ను తన వర్గంలోకి చేర్చుకోవాలని ఓపీఎస్‌ ఉవ్విళ్లూరుతున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన మదురైలో మహానాడు నిర్వహించి తన బలం నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. సొంత పార్టీ ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు