Breaking News

డీఎంకే మంత్రి అసభ్యకర వ్యాఖ్యలు.. పార్టీ పదవి నుంచి తొలగింపు

Published on Sat, 04/12/2025 - 07:08

చెన్నై: శైవ, వైష్ణవాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధిష్టానం పార్టీ పదవి నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్‌ స్పందించారు. పొన్ముడిని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. 

అయితే, శైవ, వైష్ణవాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే క్రమంలో మహిళలను కూడా అవమానించేలా పొన్ముడి మాట్లాడారు. పలువురు మహిళలను ఉదహరిస్తూ ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యల తాలూకు వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వాటిపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొన్ముడి వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. 

మరోవైపు.. ఆయనను మంత్రి పదవి నుంచి కూడా వెంటనే తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిమాండ్‌ చేశారు. హిందూ ధర్మంపై దాడులు చేస్తున్న డీఎంకే వ్యవస్థ ఆసాంతం అసభ్యకరంగా తయారైందన్నారు. పొన్ముడికి వివాదాలు కొత్తేమీ కాదు. హిందీ మాట్లాడే వారినుద్దేశించి పానీపురీ అమ్ముకుంటారంటూ గతంలోనూ ఆయన అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడారు.  ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తమిళనాడు మరోసారి రాజకీయంగా వేడెక్కింది. 

కాగా.. పొన్ముడి ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడుతూ మహిళలను వలసదారులతో పోల్చడం విమర్శలకు దారితీసింది. ఇక, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై ఆయనకు మద్రాసు హైకోర్టు జైలుశిక్ష కూడా విధించింది. దీంతో ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటు కూడా పడింది. అనంతరం శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో తిరిగి మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు.

#

Tags : 1

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)