Breaking News

అన్నామలై Vs కమల్‌: తమిళనాట రసవత్తర రాజకీయం

Published on Wed, 04/10/2024 - 09:01

సాక్షి, చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, తాజాగా అన్నామలై, కమల్‌ హాసన్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో అన్నామలై.. కమల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. దేశ రాజధాని మార్పు అంటూ ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారిని వెంటనే మెంటల్‌ ఆసుపత్రిలో చేర్పించాలి. వారి మెదడుకు సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షలు చేయాలి. మానసిక వైద్యుడి వద్దకు వెళ్లి కమల్‌ సలహాలు తీసుకుకోవాలి. దేశ రాజధానిని నాగ్‌పూర్‌కు ఎలా మారుస్తారు? అని ప్రశ్నించారు. అయితే, చెన్నైని దేశానికి వేసవి లేదా శీతాకాల రాజధానిగా చేయాలని కమల్‌ పేర్కొన్నట్లయితే నేను దానిని అంగీకరిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో డీఎంకే నుంచి రాజ్యసభ ఎంపీ కావాలనే ఉద్దేశ్యంతోనే కమల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, అన్నామలై వ్యాఖ్యలపై కమల్‌ హాసన్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఎన్నికల సందర్భంగా డీఎంకే-ఎంఎన్‌ఎం కూటమిలో భాగంగా కమల్‌ హసన్‌.. అభ్యర్థి కళానిధి వీరాస్వా మికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే నాగ్‌పూర్‌ను భారత్‌కు కొత్త రాజధానిగా చేస్తుందన్నారు.  బీజేపీ నేతలు, ఆదాయపు పన్ను శాఖ ద్వారా ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జాతీయ జెండాను కూడా త్రివర్ణ పతాకం నుంచి ఒకే రంగు ఉన్న జెండా(బీజేపీ జెండా)కు మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇదే సమయంలో గుజరాత్‌ మోడల్‌పై కూడా కమల్‌ విమర్శలు చేశారు. ప్రజలు ఎప్పుడూ గుజరాత్‌ మోడల్‌ను కోరుకోలేదు. గొప్పదని చెప్పలేదు. గుజరాత్‌ మోడల్‌ కన్నా ద్రవిడ మోడల్‌ ఎంతో గొప్పది. ఆ మోడల్‌నే మేము అనుసరిస్తాము. బీజేపీ నేతలు ద్రవిడ మోడల్‌ను విస్మరిస్తున్నారు అని కామెంట్స్‌ చేశారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?