Breaking News

తమాంగ్‌ దెబ్బ.. ‘ఎస్‌కేఎమ్‌’ కనీవినీ ఎరుగని విజయం

Published on Sun, 06/02/2024 - 19:42

గ్యాంగ్‌టక్‌:  సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్‌కేఎం) దూసుకుపోయింది. మొత్తం 32 స్థానాలకు గాను ఏకంగా 31 చోట్ల పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌)ను నామరూపాల్లేకుండా చేసింది. 

పాతికేళ్లపాటు నిరంతరాయంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీకి 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఓటమిని రుచి చూపించిన ఎస్‌కేఎం అధ్యక్షుడు, సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ వరుసగా రెండోసారి సీఎం కుర్చీని అధిష్టించబోతున్నారు. ఈ ఘన విజయాల వెనుక తమాంగ్‌ వ్యూహాలు, కృషి దాగి ఉన్నాయి.

ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ 1968 ఫిబ్రవరి 5న నేపాలీ దంపతులకు జన్మించారు. డార్జిలింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. మూడేళ్ల పాటు పాఠాలు బోధించిన తర్వాత సామాజిక సేవపై ఆసక్తి చూపించి రాజకీయం వైపు మళ్లారు. తమాంగ్‌ను పీఎస్‌ గోలేగా కూడా పిలుచుకుంటారు.

1994లో పవన్‌ చామ్లింగ్‌ స్థాపించిన ఎస్‌డీఎఫ్‌ చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎస్‌డీఎఫ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు పలు రకాల మంత్రిత్వశాఖలను నిర్వహించారు.

2009 ఎన్నికల తర్వాత తమాంగ్‌కు ఎస్‌డీఎఫ్‌తో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యేగా గెలిచినా పవన్‌ చామ్లింగ్‌ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రి పదవికి బదులు నామినేటెడ్‌ పదవి ఇచ్చారు. 

దీనిని తిరస్కరించిన తమాంగ్‌, చామ్లింగ్‌ బంధుప్రీతి, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించి రాజకీయ గురువుపైనే తిరుగుబాటు చేశారు. 2009 డిసెంబర్‌ 21న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎస్‌డీఎఫ్‌పై నిప్పులు చెరిగారు. చివరికి 2013లో ఎస్‌కేఎం పేరుతో పార్టీని స్థాపించి తాజా గెలుపుతో రెండోసారి అధికారం చేపట్టబోతున్నారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)