Breaking News

ఉప ఎన్నికల్లో గెలుపు మాదే.. తెలంగాణలో బైపోల్స్‌ ఖాయం

Published on Sun, 02/23/2025 - 16:08

సాక్షి, సిద్దిపేట జిల్లా: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి తలసాని శశ్రీనివాస్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఆ ఎన్నికల్లో గెలుపు తమదేనని జోస్యం చెప్పారు.  

తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కుటుంబ సమేతంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు.  

గత ప్రభుత్వ హయాంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేశాం.త్రాగు నీరు,వసతి గదులు,బంగారు కిరీటం వంటి అనేక విధాలుగా మల్లన్న ఆలయం అభివృద్ధి చేశాం. కేసీఆర్‌ హయాంలో మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేశారు కాబట్టే గతంలో సుమారు ఐదు కోట్లు ఉన్న ఆదాయం .. ఇప్పుడు గణనీయంగా సుమారు 20కోట్లకు పైగా చేరింది. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14నెలలు అవుతున్న రైతులు, సబ్బండ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు,420హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారెంటీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ అయిపోయింది. ఇకపై ప్రజల ఇబ్బందులపై శ్రద్ధ చూపాలి.

కులగణనపై ఏ కుల సంఘాల నాయకులు సంతృప్తి లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం మబ్బే పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ విధానాలను అన్ని గమనిస్తున్నారు. రాష్ట్ర జనాభా 4కోట్లకు పైగా జనాభా ఉంటే ప్రభుత్వం 3కోట్ల 70లక్షలుగా చూపిస్తుంది.  
 
కులగణనపై హడావిడిగా అసెంబ్లీలో చేయాల్సి తీర్మానం చేయాల్సిన అవసరం లేదు.గతంలోనే మాజీ సిఎం కేసీఆర్ అసెంబ్లీలో కులగణనపై తీర్మానం ప్రవేశ పెట్టారు. మేడిగడ్డలో చిన్న సమస్య వస్తే  భూతద్దంలో పెట్టీ చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసి సొరంగం ఘటనపై ఎవరు భాధ్యత వహిస్తారు. నోరు ఉందిగా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. కేసీఆర్ దూరదృష్టి తోనే ప్రాజెక్టులను నిర్మించి రైతులకు అండగా నిలబడ్డారు.

అన్నివర్గాల ప్రజలను కదిలిస్తే ఏ ప్రభుత్వం ప్రజలకోసం పనిచేసింది వాళ్ళే చెబుతారు. న్యాయస్థానం తీర్పు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం,ఆ ఎన్నికల్లో గెలుపు తమదేనని జోస్యం చెప్పారు.   

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు