Breaking News

TS: సీల్డ్ కవర్‌తో హైదరాబాద్‌కు డీకే శివకుమార్‌ !

Published on Tue, 12/05/2023 - 09:40

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం ఎవరనే సస్పెన్స్‌కు ఇవాళ సాయంత్రానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది. సోమవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఢిల్లీ వెళ్లిన ఏఐసీసీ ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్‌ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేతో భేటీ కానున్నారు. సీఎం, మంత్రుల జాబితాపై ఖర్గేతో చర్చించి ఫైనల్‌ చేయనున్నారు. అనంతరం డీకేఎస్‌తో పాటు మిగిలిన పరిశీలకులు సీల్డ్ కవర్‌తో మధ్యాహ్నమే హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. 

డీకే శివకుమార్‌ నేరుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన ఎల్లా హోటల్‌కు వెళ్లి వారతో సమావేశమవుతారు. అక్కడ సీల్డ్ కవర్‌లో ఉన్న సీఎం పేరును ప్రకటిస్తారు. అనంతరం ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలకు మంత్రులెవరనేది కూడా వెల్లడిస్తారు. మొత్తానికి సీఎం పదవి చేపట్టనుందెవరనేది సాయంత్రానికి తేలిపోయే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుందనేదానిపై పేరు ప్రకటించిన తర్వాతే క్లారిటీ వచ్చే ఛాన్సుంది. 

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 సీట్లు గెలిచి మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించిన విషయం తెలిసిందే. లెజిస్లేచర్‌ పార్టీ లీడర్‌ (సీఎల్పీ) నేతను ఎన్నుకోవడానికి  గెలిచిన ఎమ్మెల్యేలంతా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సోమవారం సమావేశమయ్యారు. అయితే ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకవ్యాఖ్య తీర్మానం చేసి పంపించారు. తర్వాత డీకే శివకుమార్‌ సహా ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీ వెళ్లారు. 

ఇదీచదవండి..గ్రేటర్‌ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని...

   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)