Breaking News

కేరళలో యూపీ వ్యూహం.. గణపతి శరణులో బీజేపీ!

Published on Mon, 04/15/2024 - 09:58

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ప్లాన్‌ చేస్తోంది. దీనిలో భాగంగా ఆ పార్టీ కేరళలో ఉత్తరప్రదేశ్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. యూపీలోని అలహాబాద్, మొఘల్‌సరాయ్ సహా పలు ప్రాంతాల పేర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్చారు. ఇప్పుడు ఇదే కోవలో వయనాడ్ బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్  తాను ఎంపీగా ఎన్నికైతే సుల్తాన్ బత్తేరి పట్టణం పేరును గణపతి వట్టంగా మారుస్తానని ప్రకటించారు. 

కె సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ సుల్తాన్ బత్తేరి పట్టణంను పూర్వకాలంలో గణపతి వట్టంగా పిలిచేవారని తెలిపారు. అయితే టిప్పు సుల్తాన్  ఆ పేరును సుల్తాన్ బత్తేరి పట్టణంగా మార్చాడన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే ఈ ప్రాంతం పేరును గణపతి వట్టంగా మారుస్తానన్నారు. వయనాడ్‌లో ఓట్లను కొల్లగొట్టేందుకు కొందరు టిప్పు సుల్తాన్ పేరును వాడుకుంటున్నారని సురేంద్రన్‌ ఆరోపించారు. టిప్పు సుల్తాన్‌ మతమార్పిడులకు పాల్పడ్డాడని, హిందూ, జైన దేవాలయాల కూల్చివేతకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. 

ఇదిలావుండగా వయనాడ్ నుంచి సురేంద్రన్ గెలిచే అవకాశమే లేదని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జాతీయ కార్యదర్శి  పీకే కున్హాలికుట్టి వ్యాఖ్యానించారు. సుల్తాన్ బత్తేరి పట్టణం పేరు ఎన్నటికీ మారదని, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే సురేంద్రన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి సిద్ధిఖీ ఆరోపించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)