Breaking News

‘బీజేపీది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్య హత్య’

Published on Sun, 03/24/2024 - 14:24

ముంబై: బీజేపీలోకి చేరేవాళ్లంతా.. ఆ పార్టీ మీద ప్రేమతో చేరటం లేదని ఎన్సీపీ (శరద్‌ చంద్ర పవార్‌) పార్టీ ఎంపీ సుప్రీయా సూలే అన్నారు. ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్టుమెంట్‌, సీబీఐ, ఈడీ కారణంగా బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. బారామతి నియోజకర్గంలో తనపై పోటీగా ఎవరు నిలబడతారనే విషయం ఇంకా తెలియదన్నారు. అధికారికంగా ప్రకటన వెలువడలేదని చెప్పారు. 

‘దేశంలో ప్రజాస్వాయ్యం హత్యకు గురువుతోంది. బీజేపీలో ఎవరూ ప్రేమతో చేరటం లేదు. ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్టుమెంట్‌, సీబీఐ, ఈడీ వల్ల చేరుతున్నారు. బీజేపీ ఆశోక్‌ చవాన్‌పై ఒత్తిడి తెచ్చి.. పార్టీలోకి చేర్చుకుంది. బీజేపీ.. పార్టీలను ఎలా ముక్కలు చేస్తోందో తెలుస్తోంది. ఇది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్య హత్య’ అని సుప్రీయా సూలే మండిపడ్డారు.

ఇక గత ఎన్నికలతో పోల్చితే ఈసారి భిన్నంగా ఉండే అవకాశాలు ఉ‍న్నాయి. ప్రస్తుతం ఎన్సీపీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ఇక.. ఎన్సీపీని చీల్చిన అజిత్‌ పవార్‌.. బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్‌ షిండే) కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అయితే కీలకమైన బారామతి లోక్‌సభ స్థానంలో పవార్‌ వర్సెస్‌ పవార్‌గా పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ సతీమణి పర్యావరణ కార్యకర్త సునేత్ర పవార్ బారామతి బరిలో దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బారిమతిలో ఈసారి కూడా తానే విజయం సాధిస్తానని సుప్రీయా సూలే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బారామతి నియోజకవర్గ ప్రజలకు నేను చేసిన పనులు అందరికీ తెలుసు. నాపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు’ అని సుప్రీయా సూలే స్పష్టం చేశారు. బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఆమె 2009 నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. బారామతి పార్లమెంట్‌ స్థానం ఎన్సీపీ (శరత్‌ చంద్ర పవార్‌) చీఫ్‌ శరత్‌ పవార్‌ కుటుంబానికి కంచుకోట.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)