Breaking News

అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం..

Published on Thu, 06/22/2023 - 13:22

ముంబై:  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ తనను ప్రతిపక్ష నాయకుడి పాత్ర నుండి తప్పించమని పార్టీ అధిష్టానాన్ని కోరిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిస్పందిస్తూ ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లో ఒకరైన సుప్రియా సూలే ఆయనకు ఎలా కావాలంటే అలా చేద్దాం కానీ అది నా చేతుల్లో లేదు, పార్టీ నిర్ణయించాలని అన్నారు. 

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను నియమించారు ఆ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్. అదే సమయంలో పార్టీ తరపున ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అజిత్ పవార్ ను నిర్లక్ష్యం చేశారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఆరోజునే ఈ విషయాన్ని సూటిగా ప్రశ్నించగా నేను సంతృప్తికరంగానే ఉన్నానని, ఇప్పటికే నాపై అనేక బాధ్యతలు ఉన్నాయని చెప్పిన ఆయన మెల్లగా అలగడం ప్రారంభించారు. 

ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయాలన్న కోరిక నాకు లేదు. పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారని నేనా బాధ్యతలను స్వీకరించాను. కానీ ప్రస్తుతానికైతే నన్ను ప్రతిపక్ష నాయకుడిగా తప్పించి మరేదైనా బాధ్యతను అప్పగిస్తే పూర్తి స్థాయి న్యాయం చేయగలుగుతానని పార్టీ అధిష్టానాన్ని కోరారు. 

దీనిపై స్పందిస్తూ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే.. ఆయన ఎలా కోరితే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే అది నా ఒక్కరి చేతుల్లో లేదు. పార్టీ కార్యవర్గం అంతా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఒక సోదరిగా ఆయన ఏది కోరితే అది జరగాలనే కోరుకుంటానని అన్నారు.      

ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన అమిత్ షా
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)