Breaking News

ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట

Published on Thu, 04/04/2024 - 14:34

ముంబై: మహారాష్ట్రలోని అమరావతి నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న 'నవనీత్ కౌర్‌'కు ఊరట లభించింది. కౌర్‌ కులధ్రువీకరణపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. కుల ధృవీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికెట్) విషయంలో కమిటీ నివేదికపై హైకోర్టు జోక్యం చేసుకోకూడదని న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 

నవనీత్ కౌర్‌ షెడ్యూల్డ్ కులానికి (ఎస్సీ) సంబంధించిన వారు కాదంటూ గతంలో బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా రూ. 2లక్షల జరిమానా కూడా విధించింది. ఆ తరువాత బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని నవనీత్ కౌర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నేడు ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది.

నా పుట్టుకపై ప్రశ్నలు వేసిన వారికి సమాధానం దొరికింది. సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. ఇది బాబా సాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన మార్గంలో నడిచే వారి విజయమని నవనీత్ కౌర్‌ అన్నారు.

2019లో ఎన్‌సీపీ మద్ధతుతో అమరావతి ఎంపీగా గెలిచిన నవనీత్ కౌర్.. ఇటీవల నాగ్‌పూర్‌లో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే సమక్షంలో బీజేపీలో చేరి అమరావతి నుంచి పోటీ చేస్తున్నారు. నవనీత్ కౌర్ తన భర్త రవి రాణాతో కలిసి గురువారం లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ముందు అమరావతిలోని హనుమాన్‌గర్హి మందిర్‌లో ప్రార్థనలు చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)