Breaking News

సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌

Published on Fri, 07/12/2024 - 10:51

న్యూఢిల్లీ,సాక్షి: ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. 

తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు  జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర  బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అనేక అంశాలపై తదుపరి విచారణ కోసం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. కానీ ఇటీవల కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్‌ చేయడంతో ఆయన ఇంకా జ్యుడిషియల్‌ కస్టడీలో జైల్లోనే ఉండనున్నారు.   

ఈ సందర్భంగా పలు  ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం కేజ్రీవాల్‌ అరెస్టుకు తగిన కారణాలు ఉన్నాయి. అయితే, ఇప్పటికే 90 రోజులపాటు కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నాం. సీఎం పదవికి రాజీనామా చేయాలా లేదా అన్నది ఆయన (కేజ్రీవాల్) నిర్ణయానికే వదిలేస్తున్నాం అని వ్యాఖ్యానించింది. 

కాగా, ప్రస్తుతం ఈడీ కేసులో సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్‌ దక్కినా..ఇటీవల కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. సీబీఐ కేసు పెండింగ్‌లో ఉన్నందున ఆయన జ్యుడిషయల్‌ కస్టడీ నిమిత్తం జైల్లోనే ఉండనున్నారు. ఈనెల 17న సీబీఐ కేసులో కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

ఈడీ అరెస్ట్‌ ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ మార్చి 21న ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌ అక్రమమని ఈడీని సవాల్‌ చేస్తూ ఏప్రిల్‌ 9న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేయడాన్ని సమర్ధించింది. అందులో ఎలాంటి చట్టవిరుద్దం లేదని, కేసు నిమిత్తం దర్యాప్తుకు రావాలని కోరుతూ పదే పదే జారీ చేసిన సమన్లపై స్పందించ లేదు కాబట్టే అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందని సమర్దించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఏప్రిల్ 15న సుప్రీం కోర్టు ఈడీ స్పందన కోరింది. విచారణ సందర్భంగా,మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత, అతనికి బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెలువడిన తర్వాత,కేజ్రీవాల్ అరెస్టుకు ముందు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించాలని, సంబంధిత ఫైళ్లను సమర్పించాలని ఈడీకి సూచించింది.ఈ పిటిషన్‌పై తీర్పును జస్టిస్ సంజీవ్ ఖన్నా,దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తీర్పును మే 17న రిజర్వ్ చేసింది. రిజర్వ్‌ చేసిన తీర్పులు ఇవాళ వెలువరించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)