Breaking News

తీహార్‌ జైలు నుంచి ఆప్‌ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్‌ సందేశం

Published on Thu, 04/04/2024 - 13:23

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మనీలాండరింగ్‌ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టై.. జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తీహార్‌ జైల్‌లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈడీ లాకప్ ఉండి పారిపాలన కొనసాగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు ఆదేశాలు కూడా జారీ చేశారు. తాజాగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీహార్‌ జైలు నుంచి పంపిన సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌ మీడియాకు చదవి వినిపించారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోని ప్రాంతాలను ప్రతిరోజూ సందర్శించాలని కేజ్రీవాల్‌ సూచించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని కేజ్రీవాల్‌ పేర్కొన్నాట్లు వివరించారు. ‘నేను జైలులో ఉన్నందున ఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురికావొద్దు. ప్రతిరోజూ ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గాలోని ప్రాంతాలను సందర్శించాలి. అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలి’ అని కేజ్రీవాల్‌ సందేశం పంపినట్లు సునీతా కేజ్రీవాల్‌ మీడియకు తెలిపారు.

అంతకు ముందు లిక్కర్‌ స్కామ్‌ మనీలాండరింగ్‌ కేసులో బెయిల్‌ లభించిన ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సునీతా కేజ్రీవాల్‌ కలిశారు. ఇక.. ఇటీవల అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆశీర్వదిస్తూ..వాట్సప్‌లో సందేశాలు పంపి మద్దతు పలకాలని సునీతా కేజ్రీవాల్‌ ఒక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)