Breaking News

‘డోన్‌’టాక్‌..!

Published on Mon, 02/05/2024 - 05:44

సాక్షి, నంద్యాల: అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది నంద్యాల జిల్లా డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పరిస్థితి. ఆయనకే టికెట్‌ అంటూ గతంలో ప్రకటించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ను కలిసేందుకు యత్నించినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. దీంతో సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడితే ఇలా నమ్మించి మోసం చేస్తారా.. అంటూ మండిపడుతున్నారు.

ఫిబ్రవరి 1న శ్రీశైలం దేవస్థానానికి కుటుంబ సభ్యులతో సహా వచ్చిన నారా లోకేశ్‌ టికెట్‌ కోసం అయితే తనతో మాట్లాడొద్దని ముఖం మీద చెప్పేయడమే కాకుండా... ఫిబ్రవరి 3న డోన్‌ నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పోటీ చేస్తారని అనుకూల మీడియా నుంచి పార్టీ లీకులు ఇవ్వడంపై సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.

అదేరోజు ఉదయం విజయవాడకు వెళ్లిన ఆయన రెండురోజులుగా అక్కడే మకాం వేశారు. పార్టీ పెద్దలను అపాయింట్‌ కోరినా పట్టించుకోవట్లేదని సమాచారం. గతంలో చంద్రబాబు స్వయంగా టికెట్‌ ప్రకటించి ఇప్పుడు మోసం చేయడం ఏమిటని సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.  

రాత్రికి రాత్రే మారిన సీన్‌ !
ఫిబ్రవరి 3న సుబ్బారెడ్డి విజయవాడ వెళ్లగానే సీటు నీకేనంటూ పార్టీ నుంచి సమాచారం రావడంతో సుబ్బారెడ్డి అనుచరులు పట్టణంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. బైక్‌లతో హల్‌చల్‌ చేశారు. ఈ విషయాన్ని కోట్ల వర్గీయులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో సుబ్బారెడ్డిని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. దీంతో ఆయనకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా పొమ్మనకుండా పొగపెడుతున్నారని ఆ పార్టీ నాయకులే చెప్పుకోవడం గమనార్హం.

వాడీవేడిగా విమర్శలు !
మూడు రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా కోట్ల వర్గీయులు, సుబ్బారెడ్డి వర్గీయులు రెండు గ్రూపులుగా ఏర్పడి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు టికెట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని సుబ్బారెడ్డిపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. మొత్తానికి చంద్రబాబును నమ్మి సుబ్బారెడ్డి మోసపోయారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)