Breaking News

ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

Published on Fri, 02/24/2023 - 04:58

సాక్షి, అమరావతి: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు హత్యాయత్నం కింద నమోదైన కేసులో దర్యాప్తు నిలుపుదలకు హైకో­ర్టు నిరాకరించింది. కేసు ప్రాథమిక దశలో ఉన్నం­దున దర్యాప్తును నిలిపివేయడం సాధ్యం కాద­ని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు వాదన వినకుండా  ఉత్తర్వులు ఇవ్వడం కూడా సాధ్యం కాదంది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఫిర్యాదుదారు వాదన వినకుండా ఎ­లాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది.

ఒకవేళ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే మిగిలిన కేసుల్లో కూడా ఇలాంటి పిటిషన్లు కోకొల్లలుగా దాఖలవుతాయని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఫిర్యాదుదారు మాతంగి వెంకటకృష్ణను, పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి గురువారం విచారణ జరిపారు.

పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే ముందు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ఫిర్యాదుదారు వాదన వినడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పిందని ఉదా­హ­రణలతో వివరించారు. శ్రీధర్‌రెడ్డిపై నమోదైన కేసు ప్రాథమిక దశలోనే ఉందని తెలిపారు. అంతకు ముందు శ్రీధర్‌రెడ్డి తరపు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారన్నారు. పిటిషనర్‌ విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)