Breaking News

బాలకృష్ణకు స్పీకర్‌ తమ్మినేని వార్నింగ్‌.. ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్‌

Published on Thu, 09/21/2023 - 11:42

సాక్షి, అమరావతి: ఏపీలో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ శాసనసభ, మండలిలో ఓవరాక్షన్‌ చేశారు. దీంతో, రెండు సభలు కాసేపు వాయిదా పడ్డాయి. 

► కొంత విరామం తర్వాత అసెంబ్లీ ప్రారంభమైంది. అనంతరం, కూడా టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. దీంతో, టీడీపీ సభ్యులతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా వారు వినకపోవడంతో టీడీపీ సభ్యులను ఈరోజుకు సభ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే, సభలో అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను స్పీకర్‌ హెచ్చరించారు. 

► సభలో బాలకృష్ణ మీసం మెలేసిన ఘటనపై స్పీకర్‌ హెచ్చరించారు. స్పీకర్‌ స్థానాన్ని టీడీపీ సభ్యులు అగౌరవపరిచారు. దీన్ని మొదటి తప్పుగా క్షమిస్తున్నాం. స్పీకర్‌ పోడియం దగ్గర నిలుచుని మీసం మెలేసి సభా సంప్రదాయాలను బాలకృష్ణ ఉల్లఘించారు. ఇలాంటి వికృత చేష్టలు చేయడం తప్పు. ఇలాంటి చర్యలు మళ్లీ పునారవృతం కాకూడదు. 

► ఇక, సభలో ఓవరాక్షన్‌ చేస్తూ స్పీకర్‌తో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సస్పెండ్‌ చేశారు. ఈ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌ ఉన్నారు. ఇక​, టీడీపీ సభ్యులతో పాటు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. 

ఇది ‍కూడా చదవండి: బాలకృష్ణ ఓవరాక్షన్‌.. మంత్రి అంబటి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)