Breaking News

‘ఉపాధి హామీ’ని ప్రభుత్వం నీరుగారుస్తోంది

Published on Wed, 03/19/2025 - 01:43

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయంలో తెచ్చిన ప్రతిష్టాత్మక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ సర్కార్‌ నెమ్మదిగా నీరుగారుస్తోందని కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ విమర్శించారు. మంగళవారం రాజ్యసభలో జీరోఅవర్‌లో ఉపాధిహామీ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు, దేశవ్యాప్తంగా అమలుతీరును సోనియా ప్రస్తావించారు. ‘మా ప్రభుత్వం 2005లో తెచ్చిన ఉపాధి హామీ చట్టం లక్షలాది మంది గ్రామీణ పేదలకు భరోసాగా నిలిచింది.

అయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమపద్ధతిలో నిర్వీర్యంచేయడం చాలా ఆందోళనకరం. ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు రూ.86,000 కోట్ల వద్దే స్తబ్ధుగా ఆగిపోయాయి. ఇది చాలా ఆందోళనకరం. ద్రవ్యోల్బణ సంబంధ సవరణల తర్వాత ఈ కేటాయింపుల్లో మరో రూ.4,000 కోట్లు తెగ్గోశారు. కేటాయించిన నిధుల్లో కేవలం 20 శాతం నిధులను మాత్రమే పాత బకాయిలు తీర్చేందుకు వినియోగించనున్నారు.

ఇంత తక్కువ కేటాయింపులతో పాత బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు?’’అని కేంద్రాన్ని ఆమె నిలదీశారు. తప్పనిసరిగా ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ, నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్లను అమలుచేయడం మానుకోవాలని, వేతన చెల్లింపులలో నిరంతర జాప్యాలను మానుకోవాలని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతన రేట్లు పెంచాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. 

ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కనీస వేతనం రూ. 400కు పెంచాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఉపాధి పథకాన్ని కార్యక్రమాన్ని కొనసాగించడానికి, విస్తరించడానికి నిధులను పెంచాలని ఆమె కోరారు. ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ మరియు నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటి తప్పనిసరి అవసరాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఏడాదికి కనీసం 150 రోజుల పని దొరికేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. లక్షలాది మంది గ్రామీణ పేదలకు గౌరవప్రదమైన ఉపాధి, ఆర్థిక భద్రతను అందించే కార్యక్రమం కోసం ఈ చర్యలు అవసరమని సోనియా సూచించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)