Breaking News

ప్రజాస్వామ్యం గొంతు నులిమారు: సోనియా గాంధీ

Published on Wed, 12/20/2023 - 11:16

సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల్లో విపక్షాలకు చెందిన 141 మంది ఎంపీల సస్పెన్షన్‌ వేటుపై కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఈ చర్య ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నులిమిందన్నారామె. బుధవారం ఉదయం సెంట్రల్ హాల్లో ఆమె అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ పార్టమెంటరీ సమావేశం జరిగింది.  

పార్లమెంట్‌ ఘటన పరిణామాలు, తదనంతరం రెండు సభల్లో చోటు చేసుకున్న పరిణామాలపై ఈ సందర్భంగా ఆమె సభ్యులతో చర్చించారు. ‘‘సహేతుకమైన, న్యాయబద్ధమైన డిమాండ్‌ కోసం విపక్షాలు పోరాడుతున్నాయి. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం సభ్యుల్ని సస్పెండ్‌ చేసి ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమి ఖూనీ చేసింది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు’’ అని అన్నారామె.

డిసెంబర్‌ 13వ తేదీన జరిగిన అసాధారణ పరిస్థితులపై హోం మంత్రి అమిత్‌ షా నుంచి వివరణ కోరుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విజ్ఞప్తిలో కేంద్రానికి వచ్చిన అభ్యంతరం ఏంటన్నది అర్థం కావడం లేదని అన్నారామె. 

తెలంగాణలో విజయంపై శుభాకాంక్షలు: సోనియా

‘‘అసెంబ్లీ ఎన్నికలకు అంకితభావంతో, దృఢ సంకల్పంతో పని చేస్తున్నందుకు తెలంగాణలోని మనపార్టీ సహచరులకు అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలు మనకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెరవేర్చేందుకు మన శక్తిమేరకు కృషి చేయాలి. ఈ పార్లమెంట్ సెషన్‌లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడం సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పొందుపరచింది. దాని గురించి గొప్పగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చడానికి తొమ్మిది సంవత్సరాల పాటు తీసుకుంది.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)