Breaking News

తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం 

Published on Sun, 12/10/2023 - 04:31

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడలేదని, డిసెంబర్‌ 7న ఎల్బీ స్డేడియంలో సోనియా గాంధీ వచ్చినప్పుడు తెలంగాణ తల్లి అంటే ఈ రూపంలో ఉంటుందని ప్రజలందరూ భావించారని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్బీ స్టేడియంలోకి సోనియా గాంధీ ప్రవేశించిన సమయంలో లక్షలాదిమంది తెలంగాణ బిడ్డలు లేచి స్వాగతం పలికారని, ఆ క్షణం ఆమె మొఖంలో కనిపించిన సంతోషం, సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. తెలంగాణకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కాంగ్రెస్‌ అండగా ఉంటుందని సోనియా ఓ తల్లిలా భరోసా ఇచ్చారని గుర్తు చేశారు.

తెలంగాణ బిడ్డలకు సోనియానే తల్లి అని ఆయన అభివర్ణించారు. శనివారం గాం«దీభవన్‌లో జరిగిన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో మంత్రులతో కలసి సీఎం ముఖ్యఅతి«థిగా పాల్గొన్నారు. సీనియర్‌ నేత వి.హనుమంతరావుతో కలసి 78 కిలోల కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం సోనియా ఆరు గ్యారంటీలను ఇచ్చి మరింత భరోసా కvచారన్నారు.

పాలకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తనదన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తల కృషి వల్లే తాము పదవుల్లో కూర్చున్నామని చెప్పారు. పదేళ్లు కార్యకర్తలు వేల కేసులు ఎదుర్కొన్నారని.. కార్యకర్తలకు మాట ఇస్తున్నానని.. ఈ ప్రభుత్వం కార్యకర్తలదేనని ప్రకటించారు. 

సీఎంకు సేవాదళ్‌ గౌరవ వందనం 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన వచ్చిన డిసెంబర్‌ 9 చరిత్రాత్మకమైన రోజని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నా రు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌ చార్జి మాణిక్‌ రావు ఠాక్రే, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీత క్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే‹శ్‌ కుమార్‌ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, పీసీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. సీఎం హోదాలో గాందీభవన్‌కు వచ్చి న రేవంత్‌ సేవాదళ్‌ కార్యకర్తల గౌరవ వందనం స్వీకరించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)