Breaking News

ఇల్లు.. ఓటు.. మాట నిలబెట్టుకున్న స్మృతి ఇరానీ!

Published on Thu, 04/04/2024 - 08:39

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని స్థానిక ఓటరుగా మారారు.

ఎంపీ ప్రతినిధి విజయ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీగంజ్‌లోని మెదన్ మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్న స్మృతి ఇరానీ అక్కడ ఓటరు కావడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడామె ఆ గ్రామంలో ఓటరుగా మారారని విజయ్‌ గుప్తా తెలిపారు.

స్మృతి ఇరానీ అమేథీని తన కుటుంబంగా భావిస్తారు. అమేథీ కుటుంబం మధ్య నివసించేందుకు ఆమె ఇక్కడే తన నివాసాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. ఇంటి నిర్మాణంతో ఆమె అమేథీ నుంచి ఓటరుగా నిలిచే ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం లాంఛనాలు పూర్తయ్యాయని గుప్తా తెలిపారు.

కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని గౌరీగంజ్ అసెంబ్లీ స్థానంలోని మెదన్ మావాయి గ్రామంలోని బూత్ నంబర్ 347లో ఓటరుగా మారారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి స్మృతి ఇరానీ గత ఫిబ్రవరి 22న గృహ ప్రవేశం  చేశారు. 

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి స్మృతి ఇరానీని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని సుమారు 55,000 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు.  కాగా కాంగ్రెస్ ఇప్పటి వరకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మే 20న అమేథీలో ఐదో దశలో పోలింగ్ జరగనుంది.

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)