Breaking News

భారతదేశం మీ తాతల సొత్తు కాదు

Published on Wed, 09/13/2023 - 08:55

న్యూఢిల్లీ: కొద్దిరోజుల క్రితం డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఎంతటి రాజకీయా దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసందే. ఈ వ్యాఖ్యలు ఇండియాకూటమి చేసినా వ్యాఖ్యలుగా భావంచకూడదని ఏవి ఒక పార్టేకి చెందిన చిన్న నేత చేసినవని అన్నారు ఆప్ నేత రాఘవ్ చద్దా. 

ఎవరో చిన్న నేత.. 
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి  ఇండియా కూటమి భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ నేను సనాతన ధర్మానికి చెందిన వాడిని. ఇటువంటి వ్యాఖ్యలకు అందరూ దూరంగా ఉండాలి. మనం అన్ని మతాలను గౌరవించాలన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరో ఒక పార్టీకి చెందిన చిన్ననేత చేసిన వ్యాఖ్యలని ఇండియా కూటమి అధికారికంగా చేసినవి కాదని అన్నారు.  

అదే మా ప్రణాళిక.. 
స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి చేసిందన్నట్లుగా బీజేపీ పార్టీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. దేశం ఇంతకంటే పెద్ద సమస్యలను ఎదుర్కుంటోందని ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి మేము లేవనెత్తాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నారు. ఇక ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించబోయే అంశాల గురించి ప్రస్తావించగా ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు ఒక్కో రీతిగా ఉంటాయని వాటిప్రకారం ఎన్నికల ప్రణాళికను రూపొందించే విషయమై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. కూటమి అవసరాన్ని బట్టి ఆయా పార్టీలు కొన్ని త్యాగాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. 

ఆ సీన్ రిపీట్ అవుతుంది..  
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి గురించి ప్రశ్నించగా మేము కూటమిలో నమ్మకమైన సైనికుడిగా ఉన్నామని ప్రధాని అభ్యర్థి గురించి కూటమి కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వానికి అర్హులైన చాలామంది ముఖ్య నాయకులు ఉన్నారని ఎన్డీయే కూటమిలోలా ఒక్కరి పేరు చెప్పుకుని ఎన్నికల్లోకి వెళ్ళమని అన్నారు. 1977లో కూడా ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పడిందని అప్పుడు కూడా ప్రధాని అభ్యర్థిని ముందుగా నిర్ణయించలేదని కానీ ఆ కూటమి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని గుర్తు చేస్తూ 2024లో కూడాఅదే కథ పునరావృతమవుతుందని అన్నారు.    

భయం మొదలైంది..  
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా ఇండియా కూటమి నాలుగింట విజయం సాధించగా ఎన్డీయే కూటమి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింద అక్కడ కూడా వారికి స్వల్ప ఆధిక్యత మాత్రమే దక్కిందన్నారు. ఇండియా బలమైన కూటమని ఎన్డీయే సిద్ధాంతాలు చెప్పే కూటమని అన్నారు. ఇప్పటికే వారిలో భయం పుట్టుకుందని అందుకే ఏకంగా దేశం పేరు మార్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలచుకున్నాను. ఇండియా వారి తాతల సొత్తు కాదు. 135 కోట్ల భారతీయులదని అన్నారు. త్వరలో జరుగనున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి చెబుతూ ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలకు కూడా మాట్లాడే అవకాశమివ్వాలని అజెండా లేకుండా సమావేశాలు ఏమిటో నాకర్ధం కావడం లేదని  అసలు ఈ సమావేశాల ఎజెండా ఏమిటో ఒకరిద్దరు బీజేపీ నేతలకు మినహాయిస్తే ఎవ్వరికి తెలియదని అన్నారు. 

ఇది కూడా చదవండి: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం..

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)