Breaking News

రైతులను నట్టేట ముంచుతున్న రేవంత్‌ సర్కార్‌

Published on Sun, 06/23/2024 - 04:30

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం సీజన్‌ మొదలవుతు న్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన రైతుభరోసా హామీని ఇప్పటికీ రేవంత్‌ ప్రభుత్వం అమలు చేయడం లే దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైతాంగం గొంతుకోయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, రైతులను నమ్మించి నట్టేట ముంచుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌ లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ, ఈ పాటికే రైతుబంధు డబ్బులు పడా ల్సి ఉందని, రైతుభరోసా పేరు చెప్పి రైతులను మో సం చేస్తున్నారని విమర్శించారు.

రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్‌ లైన్‌ పెట్టారని, అయితే అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుందని, సీజన్‌ అయిపోయాక రైతు భరో సా ఇస్తారా? అని ప్రశ్నించారు. రైతు భరోసాకు అర్హులెవరో ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదని నిల దీశారు. కేసీఆర్‌ హయాంలో 68.90 లక్షల మందికి  11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద ఇచ్చినట్లు చెప్పారు.

మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెర లేపారని, రైతు భరోసాకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలే ప్రామాణికం కావాలని అన్నారు. ఇదిలా ఉండగా రుణమాఫీ జరిగినట్టే కొన్ని మీడి యా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, డిసెంబర్‌ 9న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇపుడు కేబినెట్లో చర్చిస్తారా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపడేశారు.  

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)