Breaking News

175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలుస్తాం

Published on Fri, 03/08/2024 - 04:23

మేదరమెట్ల: రానున్న ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా నష్టంలేదని, 175 ఎమ్మెల్యేలతో పాటు 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయ­సాయిరెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు జాతీయ రహదారి సమీ­పంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న సిద్ధం సభకు ఏర్పాట్లను ఆయన గురువారం పరి­శీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. నాలుగవ సిద్ధం సభను భారీఎత్తున విజయవంతం చేయడానికి సర్వ సన్నద్ధమవుతున్నామని చెప్పారు.

గత ఐదేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తార­న్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాక రానున్న ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుందనే అంశాలను సీఎం ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరి­గిన సిద్ధం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు.

ఆదివారం జరిగే సిద్ధం మహా­సభకు సుమారు 15 లక్షల మంది హాజరవుతారని, వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులతో ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈసభ విజయవంతం చేసేందుకు బూత్‌ లెవల్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సభ నిర్వహించే వంద ఎకరాలకు పక్కన మరో వంద ఎకరాలను కూడా సిద్ధం చేశామన్నారు. 

రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి..
రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టును దాదాపు పూర్తిచేశామని.. తీర ప్రాంతంలో మిగిలిన పోర్టుల పనులు అత్యంత వేగంగా సాగుతున్నా­య­న్నారు. ఎన్నో పారిశ్రామిక సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నాయన్నారు. ఏపీలో తలసరి ఆదాయం పెరుగుదలకు అభివృద్ధి పనులే కారణం అన్నారు. అభివృద్ధి లేకపోతే తలసరి ఆదాయం పెరగదని చెప్పారు.

రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందజేశామని చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పైగా అమలు చేశామని తెలిపారు. బీసీలకు తెలివితేటలు లేవని, బీసీలు జడ్జిలుగా పనికిరారు అని గతంలో అన్న చంద్రబాబు ఇప్పుడు బీసీ డిక్లరే­షన్‌ అంటే ఎవరూ నమ్మరని చెప్పారు.

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 75 శాతం పదవులు ఇచ్చారని చెప్పారు. వైనాట్‌ 175 ఎందుకంటున్నామో.. సిద్ధం సభ ద్వారా చూపిస్తామన్నారు. నేషనల్‌ మీడియా నుంచి కూడా అనేక మంది సిద్ధం సభకు హాజరవుతున్నారని, సిద్ధం సభల గురించి తెలుసుకోవడానికి వారు 
ఎంతో ఆసక్తితో ఉన్నారన్నారు.

మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నాం
రానున్న ఎన్నికల కోసం మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేనలు పొత్తుల కోసం వెంపర్లాడే పార్టీలని.. తాము ముఖ్యమంత్రిని చూపించి ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. అభ్యర్థు­లను వేరే చోటికి మార్చి­నంత మాత్రాన తమ పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు. మార్చి 13, 14 లేదా 15 తేదీల్లో ఎన్నికల ప్రకటన రావచ్చన్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య­క్షుడు పానుగంటి చైతన్య ఆధ్వ­ర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన సిద్ధం టీ షర్టు­లను విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌­సీపీ ఇన్‌చార్జి పానెం చిన హనిమి­రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, యర్రగొండపాలెం నియోజ­కవర్గ ఇన్‌చార్జి తాటిపర్తి చంద్రశేఖర్, పొన్నూరు ఇన్‌చార్జి అంబటి మురళి, గుంటూరు తూర్పు ఇన్‌చార్జి ఫాతిమా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)