Breaking News

బీజేపీ మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్‌ చేసింది: సీఎం సిద్ధరామయ్య

Published on Sat, 04/13/2024 - 12:37

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్‌కు కమలం పేరుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు చేశారు. సిద్ధరామయ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో​ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల ఆఫర్‌ ఇచ్చి కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

‘గత ఏడాది నుంచి  బీజేపీ మా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడుగొట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్‌ కమలం చేపట్టింది. మా ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్ల ఆఫర్‌   ఇ‍చ్చింది. కానీ, బీజేపీ వారి ప్రయత్నం వృథా అయింది’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆశించిన స్థానాలు గెలువకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మా ప్రభుత్వానికి ఏం కాదు. మా ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా పార్టీ మారరు. కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌ పార్టీని వీడరు. నా నాయకత్వంలోనే ఐదేళ్ల పాటు పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ కొనసాగుతుంది’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

మరోవైపు.. సీఎం సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను బీజేపీ ఎంపీ ఎస్‌ ప్రకాశ్‌ తీవ్రంగా ఖండించారు. ‘సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. ఆయన పలుమార్లు ఇటువంటి ఆరోపణలు చేస్తునే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఒక వర్గం మద్దతు కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన పనులు, కాంగ్రెస్‌ పార్టీ సాధించిన  విజయలు చెప్పటం  వదిలేసి.. బీజేపీపై నకిలీ ఆరోపణల చేస్తున్నారు. లోక్‌ సభ ఎన్నికలకు బదలు.. ఎ‍న్నికల తర్వాత  సీఎం కుర్చి కోసమే ఆలోచిస్తున్నారు’ అని మండిపడ్డారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)