Breaking News

నాయకునిపై 'షూ' విసిరిన యువకుడు..

Published on Mon, 08/21/2023 - 16:01

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ సమావేశంలో ఓ వ్యక్తి షూని విసరడం కలకలం రేపింది. కార్యకర్తలను అద్దేశించి మాట్లాడతుండగా స్వామి ప్రసాద్ మౌర్యపై.. ఓ వ్యక్తి షూని విసిరాడు. దీంతో అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు అతన్ని పట్టుకుని చితకబాదారు. నిందితుడు నాయకునిపై షూ విసరడానికి గల కారణాలు తెలియదు. 

లక్నోలో ఈ రోజు ఎస్పీ సమావేశం నిర్వహించింది. పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్ కూడా సమావేశానికి వచ్చి ప్రసంగించాల్సి ఉంది. అంతకు ముందు ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంతలో కార్యకర్తల గుంపు నుంచి ఓ షూ శరవేగంగా మౌర్య వైపు దూసుకొచ్చింది. క్షణాల్లో దాన్నుంచి మౌర్య తప్పించుకున్నారు. అయితే.. షూ విసిరిన వ్యక్తిని పట్టుకున్న ఇతర కార్యకర్తలు అతన్ని చితక్కొట్టారు. 

సమావేశానికి అఖిలేష్ యాదవ్ రాక ముందే ఈ ఘటన జరిగింది. ఇది బీజేపీ నేతల పనేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మౌర్య ప్రధాన ఓబీసీ నాయకుడు. 2022లో బీజేపీ నుంచి బయటకు వచ్చి ఎస్పీలో చేరారు. ఇటీవల రామచరిత మానస్‌పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

ఇదీ చదవండి: చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు