Breaking News

బీజేపీ తొలి జాబితా.. శివరాజ్ చౌహాన్‌కు చోటు, ప్రగ్యా ఠాకూర్‌పై వేటు

Published on Sun, 03/03/2024 - 17:03

గత రెండు దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకెళ్తున్న 'శివరాజ్ సింగ్ చౌహాన్'కు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో స్థానం కల్పించింది. దీంతో ఈయన మధ్యప్రదేశ్‌లోని విదిషా నుంచి పోటీ చేయనున్నారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ వరుసగా మూడు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించిన ఘనత చౌహాన్‌దే.

లోక్‌సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేయగా, జాబితాలో చోటు సంపాదించిన పేర్లు మాత్రమే కాకుండా.. లోపాలు ఉన్న అభ్యర్థుల పేర్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీరిలో ప్రధానంగా ఫైర్‌బ్రాండ్ లీడర్ ప్రగ్యా ఠాకూర్ ఉన్నారు.

భోపాల్‌లో బీజేపీ ప్రగ్యా ఠాకూర్ స్థానంలో అలోక్ శర్మను ఎంపిక చేసింది. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు, నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అని పేర్కొనడం మాత్రమే కాకుండా 2008 ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై ఏటీఎస్‌ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే గురించి చేసిన కామెంట్లు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. ఈ కారణంగానే లోక్‌సభ సీటు ఇవ్వలేదు.

ప్రగ్యా ఠాకూర్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ తప్ప మరెవరూ స్పందించలేదు. ఆ సమయంలో క్షమాపణలు కోరినప్పటికీ.. నేను పూర్తిగా క్షమించలేనని మోదీ ఖరాకండిగా వెల్లడించారు. 2008 ఉగ్రదాడుల సమయంలో మాజీ చీఫ్ హేమంత్ కర్కరేపై వారు చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)