Breaking News

శిబు సోరెన్‌ రాజకీయ జీవితంలో విజయాలెన్ని?

Published on Sun, 05/19/2024 - 10:19

దేశ రాజకీయాల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నేతలు అరుదుగా కనిపిస్తారు. వారిలో ఒకరే జార్ఖండ్ అధికార ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత శిబు సోరెన్‌. పొడవాటి జుట్టు, మాసిన గడ్డంతో కనిపించే ఈ నేతకు 80 ఏళ్లు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శిబు సోరెన్ అక్కడి బహిరంగ సభల్లో ప్రతీకాత్మకంగా కనిపిస్తుంటారు. అంటే మోర్చా  వేదికల్లో పోస్టర్లు, బ్యానర్లలో ఆయన ఫొటో తప్పక కనిపిస్తుంది.  

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనప్పటికీ ఆయన పేరు జార్ఖండ్‌లో వాడవాడలా వినిపిస్తుంటుంది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాల విముక్తిపై పోరాటంతో శిబు సోరెన్ రాజకీయ ప్రయాణం మొదలైంది. ధన్‌బాద్‌కు ఆనుకుని ఉన్న తుండి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని శిబు తన పోరాటాన్ని ప్రారంభించారు. తొలుత పాఠశాలలో విద్యపై గ్రామీణులకు అవగాహన కల్పించారు.

1977లో శిబు సోరెన్‌ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి విఫలమయ్యారు. అయితే 1980లో లోక్‌సభలో మొదటి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 1986, 1989, 1991, 1996లలో విజయాన్ని హస్తగతం చేసుకుంటూ వచ్చారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత బాబులాల్ మరాండీ చేతిలో ఓటమి చవిచూశారు.  అయితే 2004, 2009, 2014లలో దుమ్కా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి  తిరిగి విజయాన్ని దక్కించుకున్నారు.

శిబూ సోరెన్‌ మొత్తం ఎనిమిది సార్లు దుమ్కా లో విజయపతాకం ఎగురవేశారు. శిబు సోరెన్ రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1984లో ఒకసారి జామా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ సీటులో ఆయన పెద్ద కోడలు సీతా సోరెన్‌  ఎమ్మెల్యేగా ఉన్నారు. శిబు సోరెన్‌పై పలు హత్యారోపణలు ఉన్నాయి. అయితే విచారణ తర్వాత అతనిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. శిబు సోరెన్‌ వివిధ కాలాల్లో మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)