Breaking News

‘మొసలి కన్నీరు కార్చొద్దు అతిషి’

Published on Tue, 01/07/2025 - 12:56

ఢిల్లీ : సీఎం అతిషి కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్‌ బిదూరి చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. ఆ వ్యాఖ్యలపై రమేష్‌ బిదూరి కౌంటర్‌ ఇచ్చారు. 

‘మీడియా సమావేశంలో సీఎం డ్రామాకు తెరతీశారు. ఆమె మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, ఓడిపోతామని తెలిసే ఆమ్‌ ఆద్మీ ఇలాంటి విక్టిమ్‌ కార్డ్‌ ప్లే చేస్తుందని మండిపడ్డారు.  'ఆప్దా'ను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు. 2001 పార్లమెంటు దాడిలో మన సైనికులు మరణానికి కారణమైన ఉగ్రవాది అఫ్జల్ గురు మరణశిక్షకు వ్యతిరేకంగా అతిషి మర్లెనా తల్లిదండ్రులు క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించారు. అఫ్జల్ గురుకు మద్దతుగా తండ్రి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌పై ఆమె మద్దతు ఇస్తుందో లేదో ముఖ్యమంత్రి చెప్పాలి.

కాగా, 2013లో తీహార్ జైలులో ఉరిశిక్ష పడిన అప్జల్‌ గురు కోసం రాష్ట్రపతికి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్‌పై అతిషి తల్లిదండ్రులు సంతకం చేశారని బీజేపీ వాదిస్తోంది. పార్లమెంట్ దాడిలో 9 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.

ఆతిషీ కంటతడి
ఢిల్లీ ఆతిషీ కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్‌ బిదురి చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. తన తండ్రిని దుర్భాషలాడుతూ బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆప్‌ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బిధూరి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా నాన్న టీచర్‌. ఢిల్లీలోని వేలాది మంది పేద, మధ్య తరగతి పిల్లలకు పాఠాలు బోధించారు. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్లు.

చాలా అనారోగ్యంతో ఉన్నారు. కనీసం సొంతంగా నడిచే స్థితిలో కూడా లేరు. ఎన్నికల్లో లబ్ధి కోసం అటువంటి వృద్ధుడి పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా? దేశ రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారిపోతాయని నేనెప్పుడూ అనుకోలేదు. రమేష్‌ బిదురి దక్షిణ ఢిల్లీ నుంచి పదిసార్లు ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారో కల్కాజీ ప్రజలకు చెప్పాలి. ఎమ్మెల్యేగా నేను చేసిన ఐదేళ్ల పని కంటే పదేళ్లపాటు ఆయన గొప్పగా చేసిందేమిటో చూపించాలి. అప్పుడే ఆయన ఓట్లు అడగాలి’అని అతిషి స్పష్టం చేశారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)