Breaking News

ప్రధాని మోదీ మిత్రుడంటూ.. ‘ఆప్‌’కు టీఎంసీ ఎంపీ ప్రచారం

Published on Mon, 02/03/2025 - 11:46

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎ‍న్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు(సోమవారం) సాయంత్రం ఐదు గంటలతో వివిధ పార్టీల ప్రచారపర్వం ముగియనుంది. గత నెల 20 నుంచి సాగుతున్న ఈ ప్రచారంలో పలు వింతలు విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన సీనియర్‌ నేతలు, నటులు ప్రచారాలు సాగిస్తున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శత్రుఘ్న సిన్హా  ఆదివారం ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ తరపున ప్రచారం సాగించారు. ప్రధాని మోదీని తన స్నేహితుడని అంటూనే ఆయనను ‘ప్రచార మంత్రి’అని అభివర్ణించారు. ఆయన(ప్రధాని) రోజూ 10 నుండి 12 గంటలు ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించారు.  

నటుడి నుండి రాజకీయ నేతగా మారిన సిన్హా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి ఆతిశీకి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ),  ఆమ్ ఆద్మీ పార్టీలు ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్’ (ఐఎన్‌ఐ)లో భాగస్వాములు. శత్రుఘ్న సిన్హా తన ‍ప్రసంగంలో ప్రధాని మోదీని విమర్శిస్తూ ‘మా గౌరవనీయ ప్రచార మంత్రి అంటే..ప్రధానమంత్రి అంటూ.. ఆయన నాకు స్నేహితుడు.. మనకి ప్రధానమంత్రి కూడా.. అని వ్యంగ్యోక్తి విసిరారు. ఆయన 18 గంటలు పనిచేస్తానని చెబుతారని, అయితే ఆయన ఆ 18 గంటల్లో 10 నుండి 12 గంటలు ప్రచారానికే కేటాయిస్తారని, కౌన్సిలర్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే  ఎన్నికలైనా, పార్లమెంటరీ ఎన్నికలైనా.. ఎక్కడికైనా మన గౌరవనీయ ప్రధానమంత్రి ఖచ్చితంగా అక్కడికి వెళతారు’అని సిన్హా విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ. కోటి  మొదలైన హామీలను ఇచ్చిన మోదీ వాటిని నెరవేర్చలేదని  సిన్హా అన్నారు.

ఇది కూడా చదవండి: మంచు దుప్పటిలో ఉత్తరాది.. 12 రాష్ట్రాలపై పొగమంచు దెబ్బ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)