Breaking News

శశి థరూర్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..

Published on Fri, 04/05/2024 - 15:02

తిరువనంతపురం: లోక్‌సభ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో అభ్యర్థులు ఇప్పటికే దాదాపు నామినేషన్స్ ప్రక్రియలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ తరుణంలో తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి మూడు సార్లు గెలిచిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ 'శశి థరూర్' మళ్ళీ అక్కడ నుంచే పోటీ చేయడానికి నామినేషన్ వేశారు.

శశి థరూర్ నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇందులో తన వద్ద రూ. 49 కోట్లకుపైగా స్థిరాస్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. 19 బ్యాంకు ఖాతాల మొత్తాలలో డిపాజిట్లు, వివిధ బాండ్లు, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు.

అతని అఫిడవిట్ ప్రకారం.. చరాస్తులలో రూ. 32 లక్షల విలువైన 534 గ్రాముల బంగారం, రూ. 36,000 నగదు ఉన్నట్లు వెల్లడించారు. పాలక్కాడ్‌లోని 2.51 ఎకరాల వ్యవసాయ భూమి, రాష్ట్ర రాజధానిలో రూ. 52 లక్షల విలువైన నివాసం ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా.. ఒక మారుతి సియాజ్ కారు, రెండు మారుతి ఎక్స్ఎల్6 కార్లు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇలా మొత్తం మీద శశి థరూర్ తన నామినేషన్ పత్రాల్లో రూ. 55 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు.

2014లో శశి థరూర్ ఆస్తులు విలువ రూ. 23 కోట్లు కాగా.. 2019లో ఆస్తులు రూ. 35 కోట్ల కంటే ఎక్కువని తెలిసింది. ఇప్పుడు తాజాగా  ఈయన ఆస్తులు రూ. 55 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య