Breaking News

కామారెడ్డిలో పోటీపై షబ్బీర్‌ అలీ క్లారిటీ

Published on Mon, 10/23/2023 - 17:30

సాక్షి, హైదరాబాద్‌: తాను నియోజవర్గం మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ. కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని షబ్బీర్‌ ఆలీ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్‌ కామారెడ్డి వచ్చారన్నారు. తన పుట్టుక, చావు కామారెడ్డిలోనేనని షబ్బీర్‌ ఆలీ తేల్చిచెప్పారు.

‘కేసీఆర్‌కు స్వాగతం  పలుకుతున్నాను. కామారెడ్డికి రండి.. ఇద్దరం పోటీలో ఉందాం. ఇద్దరం ప్రజాక్షేత్రంలో తలబడదాం. మీ నిజాయితీని నిరూపించుకోండి.  నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. ప్రజలే నిర్ణయిస్తారు. అంతే కానీ నీవు అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరు’  అని తెలిపారు.

కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ బరిలో నిలుస్తుండటంతో షబ్బీర్‌ అలీ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రత్యర్థిగా కేసీఆర్‌ఉండటంతోనే పోటీకి షబ్బీర్‌ ఆలీ విముఖత వ్యక్తం చేస్తారనేది ఆ రూమర్ల సారాంశం. కేసీఆర్‌పై పోటీకి దిగితే అది తన పొలిటికల్‌ కెరీర్‌పై పడుతుందంటూ వార్తలు వ్యాపించాయి. ప్రస్తుత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని షబ్బీర్‌ అలీ ఆలోచిస్తున్నట్టు పార్టీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిని తాజాగా ఖండిస్తూ తన పోటీ కామారెడ్డి నుంచేనని స్పష్టం చేయడంతో  ఆ రూమర్లకు ఫుల్‌ స్టాప్‌ పడింది. 

ఇది కూడా చదవండి: కమీషన్ల కోసమే కాళేశ్వరం.. కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌

‘‘క్లిక్‌ చేసి వాట్సాప్‌ ఛానెల్‌ ఫాలో అవ్వండి’’

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)