Breaking News

కాంగ్రెస్‌కు షాక్‌.. నామినేషన్‌ వెనక్కి తీసుకున్న ఇండోర్‌ అభ్యర్థి

Published on Mon, 04/29/2024 - 13:31

భోపాల్‌: లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌కు వరుస షాక్‌ తగులుతున్నాయి. తాజాగా ఇండోర్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి.. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఇండోర్‌ ఎంపీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బామ్‌ చివరి నిమిషంలో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అనంతరం ఆయన హస్తం పార్టీని వీడి అధికార బీజేపీలో చేరారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లోక్‌సభ స్థానానికి నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఇండోర్‌ సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ శంకర్‌ లాల్వానీకి పోటీగా కాంగ్రెస్‌ కాంతిని బరిలోకి దింపింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు నేడే (ఏప్రిల్‌ 29) ఆఖరి తేదీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అక్షయ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్‌ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా కూడా ఉన్నారు. 

కాంగ్రెస్‌ ఇండోర్‌ అభ్యర్థి అక్షయ్‌ బీజేపీలో చేరినట్లు మంత్రి  విజయ్‌వర్గియ పేర్కొన్నారు. అక్షయ్‌తో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ఆయన్ను పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇండోర్‌ మరో సూరత్‌ కానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవడం, మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)