Breaking News

25న ఇందిరాపార్క్‌ ధర్నాను విరమించుకోండి

Published on Wed, 10/23/2024 - 06:17

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేతలు ఈ నెల 25న ఇందిరాపార్కు వద్ద తలపె ట్టిన ధర్నాను విరమించుకోవాలని, గత పదేళ్లలో మూసీ ప్రక్షాళనకు, మూసీ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధికి నయా పైసా కేటాయించని కేంద్రం ఎదుట ధర్నా చేయాలని మంత్రి సీతక్క హితవు పలికారు. యూపీఏ హయాంలో మూసీ ప్రక్షాళనకు రూ.335 కోట్లు మంజూరు చేస్తే, మోదీ పాలనలో పైసా మంజూరు కాకపోయినా కిషన్‌రెడ్డి ఎందుకు పెదవి విప్పలేదని మంగళవారం ఓ ప్రకటనలో నిలదీశారు. ఇతర నదుల ప్రక్షాళన కు నిధులిచ్చి మూసీ ప్రక్షాళనకు పైసా కేటాయించకపోవడం తెలంగాణపై కేంద్రం వివక్షతకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.

సొంత నియోజకవర్గం మీదుగా మూసీ పారు తున్నా ఏనాడూ కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కిషన్‌రెడ్డి ఇప్పుడు ధర్నాకు పిలుపునివ్వడం ఏమిటో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఒక కేంద్రమంత్రి ప్రాతిని ధ్యం వహిస్తున్నందున.. కేంద్రంతో చర్చించి హైదరాబాద్‌ జీవనరేఖగా భావించే మూసీ పునరుజ్జీవానికి రూ.10 వేల కోట్లు మంజూరు చేయించాలని డిమాండ్‌ చేశారు. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును సమర్థిస్తున్న బీజేపీ ఇక్కడ మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)