Breaking News

బీజేపీ పెద్దలకు సీమా హైదర్ రాఖీ..

Published on Tue, 08/22/2023 - 21:22

లక్నో: ప్రియుని కోసం పాకిస్థాన్ వదిలి భారత్ వచ్చిన సీమా హైదర్‌ ప్రధాని మోదీకి రాఖీ పంపించింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు మోహన్ భగవత్‌తో సహా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు కూడా రాఖీలు పంపించింది. ఈ నెల 30న రాఖీ పండగ సందర్భంగా రాఖీలను పోస్టు చేసినట్లు తెలిపింది.  

'ఈ దేశ బాధ్యతలను భుజాలకెత్తుకున్న నా సోదరులకు రాఖీలను పింపించాను. జై శ్రీరాం, జై హింద్, హిందుస్థాన్ జిందాబాద్.' అంటూ సీమా హైదర్ నినాదాలు చేసింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాగ్రౌండ్‌లో 'బయ్యా మేరే రాఖీ కె బంధన్‌ కో నిభానా' అనే సాంగ్‌ కూడా ప్లే అవుతోంది. సీమా తన పిల్లలతో కలిసి రాఖీ కడుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి. 

పబ్జీలో పరిచయమైన సచిన్‌ అనే యువకున్ని ప్రమించి అతని కోసం స్వదేశమైన పాక్‌ను దాటి వచ్చేసింది సీమా హైదర్. పిల్లలతో కలిసి దుబాయ్ మీదుగా నేపాల్ చేరి అటునుంచి ఉత్తరప్రదేశ్‌కి చేరింది. ఆమెపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పట్లో అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె తన ప్రియునితో కలిసి నోయిడాలో జీవిస్తోంది.

ఇదీ చదవండి: ప్రధాని మోదీకి పాక్‌ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా..

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)