Breaking News

కార్మికులతో ముచ్చటించిన సింథియా.. రాజకీయాల్లో రాహుల్‌తో పోలిక..?

Published on Fri, 07/07/2023 - 14:38

ఢిల్లీ: భారత్ జోడో యాత్ర మొదలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. ట్రక్కు డ్రైవర్ల నుంచి కార‍్మికుల వరకు అందర్ని పలకరిస్తూ తన రాజకీయ పంథాను కొనసాగించారు. గతంలో రాహుల్‌ గాంధీకి అనుచరుడైన ప్రస్తుత బీజేపీ నాయకుడు జ‍్యోతిరాదిత్య సింథియా తాజాగా గ్వాలియర్‌లోని ఓ రెస్టారెంట్ కార్మికులను పలకరించారు. దీంతో నెటిజన్లు రాహుల్‌నే ఫాలో అవుతున్నారా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ‍్నించారు. దీనికి సింథియా ఏం చెప్పారంటే..?

ఇటీవల జ్యోతిరాదిత్య సింథియా గ్వాలియర్ వెళ్లే క్రమంలో ఓ రెస్టారెంట్ వద్ద ఆగారు. అక్కడి కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల అందించిన ఆహారాన్ని తీసుకున్నారు. కార్మికుల్లో ఓ వృద్ధురాలు నుంచి ఆశీస్సులను పొందారు.

ఈ వీడియోను ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందించి.. ఇలా కార్మికులను కలవడం రాహుల్‌ గాంధీ నుంచి నేర్చుకున్నారా? అని ప్రశ్నించారు. దీనికి సింథియా కూడా సింపుల్‌గా బదులు చెప్పారు. నిజంగా నేర్చుకోవడం లేదని చెప్పారు. 

2020లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలో కమల్‌నాథ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు సింథియా. 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శివరాజ్ సింగ్‌తో చేతులు కలిపారు. అదే ఏడాది ఆయన రాజ్య సభకు ఎంపికయ్యారు. అనంతరం 2021లో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చదవండి: గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురు

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)